తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటేలా గ్లోబల్ సమ్మిట్లో కళా ప్రదర్శనలు డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026 సమ్మిట్ ప్రారంభోత్సవం, కల్చరల్ కార్నివాల్, ప్రచార కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలి: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు
హైదరాబాద్.అర్జున్ సమాచారం: తెలంగాణ గొప్ప సాంస్కృతిక, కళా వారసత్వాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చాటిచెప్పేలా డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026 సందర్భంగా జానపద, శాస్త్రీయ సంగీత, నృత్య కార్యక్రమాలతో పాటు వివిధ సాంస్కృతిక కళారూపాల ప్రదర్శనలను విస్తృతంగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026 నిర్వహణకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై బుధవారం సంబంధిత ఉన్నతాధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ...