తెలుగు రాష్ట్రాల్లో కోటి ఓట్లు మిస్సింగ్
హైదరాబాద్, ఆగస్టు 19,అర్జున్ సమాచారం: కేంద్ర ఎన్నికల సంఘం తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో చేపట్టిన సమగ్ర ప్రక్షాళన ప్రక్రియ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. రెండు రాష్ట్రాల్లో కలిపి సాంకేతికంగా కోటి ఇరవై లక్షలకు పైగా ఓట్లు చెల్లుబాటు కాకుండా పోతున్నాయి. జాబితా నుంచి తొలగింపునకు గురవుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటూ కీలకమే అయినప్పటికీ, ప్రధాన రాజకీయ పార్టీలు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేయకపోవడం, సైలెంట్‌గా ఉండటం వెనుక ఏం జరుగుతోంది? వాస్తవానికి ఈ గల్లంతు ప్రక్రియ అంతా అర్హులైన ఓటర్లను...