తెల్ల కాగితం’ మూవీ నుంచి ‘తెలుసా తెలుసా’ సాంగ్ రిలీజ్
శ్రీమతి కె. శ్రీదేవి సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ మీద కృష్ణ కొమ్మాలపాటి నిర్మిస్తున్న చిత్రం ‘తెల్ల కాగితం’. హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా నటిస్తున్న ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు నందు సవిరిగాన అందిస్తున్నారు. ఈ మూవీకి రమేష్ బండ్రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న విడుదల చేయబోతోన్నారు. ఈ క్రమంలో రిలీజ్ చేసిన పోస్టర్లు, పాటలు, టీజర్ అన్నీ కూడా ఆడియెన్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. తాజాగా ఈ మూవీ నుంచి ‘తెలుసా తెలుసా’ అంటూ...