తేలప్రోలు వద్ద ఘోర ప్రమాదం: డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టిన ప్రైవేటు బస్సు 25 మంది ప్రయాణికులకు గాయాలు – ఏడుగురి పరిస్థితి విషమం చెన్నై నుంచి వైజాగ్ వెళ్తుండగా అర్ధరాత్రి దాటాక ప్రమాదం క్షతగాత్రులు పిన్నమనేని ఆస్పత్రికి తరలింపు
ఉంగుటూరు, ఆగస్టు 4,అర్జున్ సమాచారం: ఉంగుటూరు మండలం తేలప్రోలు సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చెన్నై నుంచి వైజాగ్‌కు 25 మంది ప్రయాణికులతో వెళ్తున్న 'బి.ఎల్.ఎమ్' (BLM) ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ బస్సు అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. అనంతరం రహదారిపైనే పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 25 మంది గాయపడగా, వారిలో ఏడుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా...