దళితులు, గిరిజనులు అంటే కూటమి ప్రభుత్వానికి చిన్నచూపా…? పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పరిధిలో ఈ గ్రామాలు ఉన్నప్పటికీ త్రాగునీటి సమస్య ఎందుకు పరిష్కరించరు…? బొల్లాపల్లి మండలంలోని గ్రామాలను అధికారులు వెంటనే సందర్శించాలి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య
నరసరావుపేట,అర్జున్ సమాచారం: పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండల పరిధిలోని కండ్రిగ, గుట్టపల్లి, గంగుపల్లి గ్రామాలకు తక్షణమే తాగునీరు, సాగునీరు కల్పించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో పల్నాడు కలెక్టర్ కార్యాలయం వద్ద ఆయా గ్రామాల ప్రజలతో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కృతిక శుక్లకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 80 సంవత్సరాలు కావస్తున్నా ప్రజలకు కనీస తాగునీటి సదుపాయం...