దశాబ్ద కాలం తర్వాత ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికలు

హైదరాబాద్,అర్జున్ సమాచారం: అక్టోబర్ 9న జరిగే గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఆర్టీసీ కార్మిక లోకం స్వచ్ఛందంగా పాల్గొనాలి మంత్రి పొన్నం ప్రభాకర్. గత ప్రభుత్వ హయాంలో కాలరాసిన ఆర్టీసీ కార్మిక సంఘాల హక్కులను ప్రజాపాలన ప్రభుత్వం తిరిగి పునరుద్ధరిస్తోందని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. దాదాపు దశాబ్దం తర్వాత తెలంగాణ ఆర్టీసీలో కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు జరగబోతున్నాయని మంత్రి తెలిపారు. ఆర్టీసీ కార్మిక సంఘాల చివరి గుర్తింపు ఎన్నికలు 2016 జూలై 19న జరిగాయని,...