దానం నాగేందర్‌ అనర్హతపై హైకోర్టు తీర్పును స్వాగతించిన బీజేపీ

హైదరాబాద్, సెప్టెంబర్ 18,అర్జున్ సమాచారం: దానం నాగేందర్‌ అనర్హతకు సంబంధించిన కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును భారతీయ జనతా పార్టీ స్వాగతించింది. ప్రజాస్వామ్య పరిరక్షణ, న్యాయం కోసం బీజేపీ అనేక రోజులుగా పోరాటం చేస్తోందని బీజేపీఎల్పీ నేత తెలిపారు. ఒక పార్టీ తరఫున గెలిచి, అనంతరం మరో పార్టీ తరఫున కొనసాగుతున్న దానం నాగేందర్‌ వ్యవహారంపై బీజేపీ న్యాయస్థానాన్ని ఆశ్రయించిందని ఆయన పేర్కొన్నారు. స్పీకర్‌ నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేయడం ప్రజాస్వామ్య పరిరక్షణకు కీలకమైన పరిణామమని, ఈ తీర్పు ప్రజాస్వామ్య చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినదని అన్నారు....