దివ్యాంగులకు కాంగ్రెస్ దగా.. ఒక్కొక్కరికీ రూ.66 వేలు బాకీ పడ్డ రేవంత్ రెడ్డి: మాజీ మంత్రి హరీశ్ రావు దివ్యాంగుల పట్ల ఈ ప్రభుత్వానికి కనీస మానవత్వం లేదు. ఆనాడు రూ.500 ఉన్న పెన్షన్‌ను రూ.4,016 చేసి ఆదుకున్నది కేసీఆర్ హామీ ఇచ్చిన రూ.6,000 పెన్షన్ ఏది? బ్యాక్‌లాగ్ పోస్టులు, ఉచిత బస్సు ఏమాయె. బడా కాంట్రాక్టర్లకు బిల్లులిస్తే కమీషన్లు వస్తాయి.. దివ్యాంగులకు ఇస్తే రావు. అందాల పోటీలకు, ఫుట్‌బాల్ సోకులకు డబ్బులుంటాయి కానీ పెన్షన్లకు ఉండవా 30 వేల కోట్ల భూములు అమ్మాడు, వందల కోట్ల ఆస్తులు తమ్ముడికి కట్టబెట్టాడు.

అర్జున్ సమాచారం: హామీలు అడిగితే తప్పుపడతారా.. దివ్యాంగుల పక్షాన ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నా చేస్తాం కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగుల పట్ల అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ, ఎన్నికల హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ హస్తినాపురంలోని జీఎస్ఆర్ కన్వెన్షన్ హాల్‌లో శనివారం ఉదయం సమర శంఖారావం సభ జరిగింది. స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పక్ష...