ది ట్రెయిటర్స్’కు హోస్ట్ చేయడం చాలా ఎంజాయ్ చేశాను : హీరో తేజ సజ్జ

భారతదేశంలో ప్రత్యేక ఒరిజినల్స్‌కు పేరుపొందిన ప్రముఖ స్ట్రీమింగ్ సర్విస్ ప్రైమ్ వీడియో ‘ది ట్రెయిటర్స్ తెలుగు’ తో అలరించబోతోంది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ రియాలిటీ ఫార్మాట్‌ను తెలుగు ప్రేక్షకుల కోసం ప్రత్యేకమైన స్థానిక హంగులతో తీసుకొస్తున్నారు. స్టార్ హీరో తేజ సజ్జ ఈ షోని హోస్ట్‌ చేస్తున్నారు. విభిన్న రంగాలకు చెందిన 20 మంది సెలబ్రిటీలు ఈ గేమ్‌లో పాల్గొంటున్నారు. మొత్తం 10 ఎపిసోడ్లుగా రూపొందిన ఈ సిరీస్‌లో పోటీదారులు నమ్మకమే ప్రమాదంగా మారే ఒక ప్రపంచంలోకి అడుగుపెడతారు. ఎవరిని నమ్మాలి? ఎవరిని...