“ది ప్యారడైజ్‌” మూవీలో యాక్షన్ నెక్స్ట్ లెవల్‌లో ఉంటుంది : ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్

న్యాచురల్ స్టార్ నాని పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, గ్లింప్స్, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్‌తో భారీ అంచనాలు పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. ప్యారడైజ్‌కు ఎంతమంది ఫైట్ మాస్టర్స్ పనిచేశారు? మేము, నవకాంత్, రియల్ సతీష్...