ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 03 October 2026, 7:20 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

దేవాలయాలపై దాడులను అపేలా చర్యలు తీసుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందు

హైదరాబాద్:అర్జున్ సమాచారం:
దేవాలయాలపై జరుగుతున్న దాడులను అపేలా చర్యలు తీసుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, ఈ చిచ్చును ఆపాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపైనే ఉందని ఎంపీ  ఈటల రాజేందర్ హెచ్చరించారు.

దిల్‌సుఖ్‌నగర్‌లోని సంతోషిమాత దేవాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ…

“ఒక సైకో, ఒక ఉన్మాది సంతోషిమాత దేవాలయంలో దాడి చేశాడు. ఈ దాడి మొదటిది కాదు, ఇప్పటికే 20 ఆలయాలకు పైగా దాడులు జరిగాయి. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు, మన హృదయాలను గాయపరుస్తున్నారు.

సీఎం కుర్చీలో కూర్చున్న రేవంత్ రెడ్డి ‘నా పేరు రేవంత్ రెడ్డి కాదు, రేవంతుద్దీన్’ అని చెప్పుకుంటున్నారు. మీరు మతం మార్చుకోండి, మాకేం అభ్యంతరం లేదు; కానీ, అన్ని మతాలను సమానంగా చూడాల్సిన బాధ్యత ఉందని మర్చిపోవద్దు.

ధార్మిక సంస్థలలో మత ప్రబోధకుల ప్రోత్బలంతోనే ఈ దాడులు జరుగుతున్నాయి. హిందూ ధర్మం ప్రపంచానికే ఆదర్శం. ఇతర దేశస్థులు కూడా మన ధర్మాన్ని ఆచరిస్తున్నారు. నాగరికతను, మానవత్వాన్ని నేర్పించిన దేశం మన భారతదేశం. దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి శిక్షించడం మాత్రమే మా కోరిక కాదు. ఇలా చేయడానికి కారణమైన వారు, ప్రసంగాలతో రెచ్చగొట్టే వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. చిన్న వయసు నుంచే పరమతంపై విద్వేషం నింపుతున్న ధోరణులను అరికట్టాలి. వాటిని ఆపకపోతే తీవ్ర నష్టం జరుగుతుంది.
అగ్రగామి దేశం అమెరికాలో ట్విన్ టవర్స్‌ను సైతం ఈ ఉన్మాదం కూల్చివేసింది. దీనిపై ప్రపంచమే ఆలోచిస్తోంది.

మన పైలట్‌ను చంపి విమానాన్ని హైజాక్ చేసి ట్విన్ టవర్స్ ఉన్మాదాన్ని మళ్ళీ చేద్దామని ప్రయత్నిస్తే… మన భారతమాత ముద్దుబిడ్డ క్యాప్టెన్ స్మిత్ మచ్చ్హర్ ప్రాణాలకు తెగించి పోరాడారు. ఒమన్ జాతీయుడైన కో-పైలట్‌కి తన మతంపై తనకు విశ్వాసం ఉండవచ్చు, కానీ పక్కవాడి విశ్వాసంపై దాడి చేసే అధికారం నీకెవరు ఇచ్చాడ్రా?

ISIS పేరుమీద జరుగుతున్న నరమేధాన్ని చూస్తున్నాం. ఇదే దిల్‌సుఖ్‌నగర్‌లో బాంబులు పేల్చింది ఎవరు? గోకుల్ చాట్, లుంబిని పార్క్ వద్ద నరమేధం సృష్టించింది ఎవరు? దాని వెనుక ఉన్నది ఎవరో మన కళ్ల ముందే చరిత్ర ఉంది.

భారత జాతి ప్రశాంతతను కోరుకుంటుంది, పరమత సహనంతో ఉంటుంది. ఆ సహనాన్ని, ఓపికను పరీక్షించవద్దు అని హెచ్చరిస్తున్నా. ఈ దాడులను ప్రోత్సహించే వారిని సహించేది లేదు. అన్ని వర్గాల ప్రజల ప్రాణాలు, ఆస్తులు, విశ్వాసాలు కాపాడే బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అలా చేయకుండా వారిని ప్రోత్సహిస్తే సరికాదు.”
======================