ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 07 July 2026, 7:53 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

దోస్త్–2026 ప్రవేశాల్లో రాష్ట్రంలో ఎస్‌ఆర్‌ఆర్ ప్రభుత్వ కళాశాలకు ప్రథమ స్థానం

కరీంనగర్ ,జూలై 07,అర్జున్ సమాచారం:
దోస్త్–2026 డిగ్రీ ప్రవేశాల్లో కరీంనగర్‌లోని ఎస్‌.ఆర్‌.ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల (అటానమస్) రాష్ట్రవ్యాప్తంగా 1,561 అడ్మిషన్లతో ప్రథమ స్థానం సాధించినట్లు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. రామకృష్ణ తెలిపారు. మూడు విడతల కౌన్సెలింగ్ ద్వారా ఈ ప్రవేశాలు పూర్తయ్యాయని, మిగిలిన సీట్లను దోస్త్ స్పెషల్ ఫేజ్ ద్వారా భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇంకా సీట్లు పొందని విద్యార్థులు స్పెషల్ ఫేజ్‌ను వినియోగించుకోవాలని సూచించారు. అలాగే జూలై 10 నుంచి 13 వరకు ఇంట్రా-కాలేజ్ ఫేజ్ ద్వారా కోర్సుల మార్పు కోసం వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని, జూలై 14న అలాట్‌మెంట్ విడుదల కానుందని తెలిపారు. రాష్ట్రంలో ప్రథమ స్థానం సాధించిన సందర్భంగా కళాశాల అధ్యాపకులు, అధికారులు, సిబ్బంది ప్రిన్సిపాల్‌ను అభినందించారు.
=======================