ధరణి అక్రమాలపై ఉక్కుపాదం అక్ర‌మాల బ‌ట్ట‌బ‌య‌లుకు ఫాస్ట్‌ట్రాక్ విచారణ పేదల భూములు కాజేసిన వారిని వదిలిపెట్టం నిషేధిత జాబితాలో కొత్తగా అంగుళం భూమి కూడా చేర్చలేదు భూముల ధరల సవరణతో స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ల ఆదాయం 20% వరకు పెరుగుదల త్వ‌ర‌లో అసైన్డ్ భూములపై సమగ్ర విధాన నిర్ణయం కేంద్రం నిధులు ఇవ్వకపోయినా ఇందిరమ్మ ఇళ్ల ఫైనల్ బిల్లులు చెల్లిస్తాం

హైదరాబాద్,అర్జున్ సమాచారం: ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకుని పేదల భూములు, ప్రభుత్వ భూములను అక్రమంగా కాజేసిన వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార & పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి  స్పష్టం చేశారు. ధరణి నుంచి భూభారతి వరకు జరిగిన ప్రతి భూ లావాదేవీని ఫాస్ట్‌ట్రాక్ విధానంలో విచారిస్తున్నామని, అక్రమాలకు పాల్పడిన వారెవరైనా చట్టం ముందు నిలబెట్టడం ఖాయమని హెచ్చరించారు. శనివారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మీడియా ప్రతినిధులతో మంత్రి  మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో...