నకిలీ ₹500 నోట్ల వ్యవహారం గుట్టురట్టు.. రాజస్థాన్ యువకుడు అరెస్ట్
హైదరాబాద్:అర్జున్ సమాచారం: నగరంలో నకిలీ కరెన్సీ నోట్లను చలామణి చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ యువకుడిని గోషామహల్ పోలీసులు అరెస్ట్ చేశారు. బేగంబజార్ ఛత్రి వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా కనిపించిన *విక్రమ్ (21)*ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో పలు వివరాలు వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారుల వద్ద ₹500 నకిలీ నోటు ఇచ్చి వస్తువులు కొనుగోలు చేసి.. అసలు కరెన్సీ రూపంలో సుమారు ₹400 చిల్లర తీసుకునేవాడని పోలీసులు గుర్తించారు. విక్రమ్ వద్ద...