నటుడు నారాయణ రావు మృతి
హైదరాబాద్,అర్జున్ సమాచారం: ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణ రావు (73) కన్నుమూసారు. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కృష్ణా జిల్లా, కురుమద్దాలి గ్రామంలో జన్మించిన నారాయణరావు, 1976 లో వచ్చిన అంతులేని కథ సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు. దాదాపు సినిమాలలో పైగా నటించారు. పలు టి.వి.సీరియళ్లలో కూడా నటించారు. మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో శిక్షణ తీసుకున్నారు. రజనీకాంత్,చిరంజీవి కి నారాయణరావు...