నన్ను చంపేందుకు కుట్ర.. భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఉత్తరాఖండ్ మంత్రి భర్త గిరిధారి లాల్ సాహుపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మంత్రి రేఖా ఆర్య గృహ హింస, హత్యాయత్నం, కుట్ర చేస్తున్నారని ఆరోపణ తనను చంపేందుకు భర్త కుట్ర పన్నిన ఆడియో లభించిందని వెల్లడి గత వివాహాన్ని దాచిపెట్టి తనను పెళ్లి చేసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్న మంత్రి తన పిల్లల భద్రత కోసమే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నానని స్పష్టీకరణ.
అర్జున్ సమాచారం: డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి రేఖా ఆర్య తన భర్త గిరిధారి లాల్ సాహుపై సంచలన ఆరోపణలు చేశారు. తనపై గృహ హింసకు పాల్పడుతున్నారని, ప్రాణహాని ఉందని, తనను హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపిస్తూ డెహ్రాడూన్లోని కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన భర్తపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు. తన మైనర్ పిల్లల భద్రతపై కూడా ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై...