నర్సాపురం నుంచి భక్తులకు వరం అరుణాచలం రైలు రెగ్యులర్.. బెంగళూరుకు మరో సర్వీస్ రైల్వే ప్రాజెక్టులతో నర్సాపురం అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉం ది – కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ
భీమవరం, జూలై 1,అర్జున్ సమాచారం: ప్రజలు, భక్తుల చిరకాల కోరిక నెరవేరిందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. నర్సాపురం–అరుణాచలం (తిరువణ్ణామలై) వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను పూర్తిస్థాయి రెగ్యులర్ రైలుగా మార్చి బుధవారం భీమవరం టౌన్ రైల్వే స్టేషన్‌లో లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు. గత ఏడాది జూలై 9న ప్రత్యేక రైలుగా ప్రారంభమైన ఈ సర్వీస్‌కు 110 శాతం ఆక్యుపెన్సీ నమోదవడంతో రైల్వే ఉన్నతాధికారులతో చర్చించి రెగ్యులర్ సర్వీస్‌కు అనుమతులు సాధించినట్లు వెల్లడించారు. జూలై 10 నుంచి నర్సాపురం–బెంగళూరు రెగ్యులర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్...