నలుగురు అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ సాంకేతిక ఆధారాలతో కేసు చేదించిన మావల పోలీసులు. 36 గ్రాముల బంగారం, 25.5 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం ప్రజలు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి గతంలో A1 పై 8 , A2 పై మూడు దొంగతనం కేసులు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

ఆదిలాబాద్,అర్జున్ సమాచారం: జిల్లా మావల పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన వరుస దొంగతనాల కేసులను మావల పోలీసులు సమర్థవంతంగా ఛేదించి, నలుగురు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలిపారు. వివరాలలో ఈ ఏడాది జనవరి 18న ఆదర్శ్‌నగర్‌కు చెందిన నైతం గణేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లిన సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించి...