నవంబర్ 30న ఏపీ, తెలంగాణ ఓటర్ల తుది జాబితా.. మళ్లీ మారిన షెడ్యూల్ ఏపీ, తెలంగాణలో మళ్లీ మారిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ షెడ్యూల్ రెండు రాష్ట్రాల్లోనూ నవంబర్ 30న ఓటర్ల తుది జాబితా వెల్లడి సీఈవోల విజ్ఞప్తి మేరకు షెడ్యూల్‌ను మార్చిన కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణలో నవంబర్ 26, ఏపీలో నవంబర్ 20 వరకు పొడిగించిన అభ్యంతరాల గడువు తెలంగాణలో 2.59 కోట్లు, ఏపీలో 42.55 లక్షల ఓటర్ల పేర్లకు తుది జాబితాలో చోటు

హైద‌రాబాద్, అర్జున్ సమాచారం: రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) కార్యక్రమ షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) మరోసారి మార్పు చేసింది. రెండు రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారుల (సీఈవోలు) విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. తాజా మార్పులతో రెండు రాష్ట్రాల్లోనూ ఓటర్ల తుది జాబితా నవంబర్ 30వ తేదీన ప్రచురితం కానుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం రెండు రాష్ట్రాల సీఈవోలకు వేర్వేరుగా సమాచారం అందించింది. ఓటర్ల జాబితాలో చేర్పులు, మార్పులపై వచ్చిన...