ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 25 November 2026, 6:27 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

నాకు క్యాన్సర్ ఉందని కేటీఆర్ తప్పుడు ప్రచారం చేయించారు: కవిత – త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ కొట్టుకుపోవడం ఖాయమన్న కవిత – టీఆర్ఎస్ పార్టీ ఆదరణ చూసి ఓర్వలేకే తనపై దాడులు చేస్తున్నారని వ్యాఖ్య – ఇప్పటికే తనను ఇంట్లో నుంచి వెళ్లగొట్టారని ఆవేదన

 అర్జున్ సమాచారం:
త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ కొట్టుకుపోవడం ఖాయమని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధినేత్రి కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. ఒక మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె, బీఆర్ఎస్ నాయకత్వంపై పలు తీవ్ర ఆరోపణలు చేశారు. తమ పార్టీ టీఆర్ఎస్‌కు ప్రజల్లో ఆదరణ పెరుగుతోందనే భయంతోనే బీఆర్ఎస్ నేతలు తనపై వ్యక్తిగతంగా దాడులు చేస్తున్నారని కవిత పేర్కొన్నారు. తనను ఇలా వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం వల్ల వారికి ఏం వస్తుందని ఆమె ప్రశ్నించారు. ఇప్పటికే తనను ఇంటి నుంచి వెళ్లగొట్టారని, ఇంకా ఏం సాధిస్తారని అన్నారు. గతంలోనూ తన ఆరోగ్యంపై కేటీఆర్ తప్పుడు ప్రచారం చేయించారని, తనకు క్యాన్సర్ ఉందని, త్వరలోనే చనిపోతానంటూ ప్రచారం చేశారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే తన నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం గతంలో కేసీఆర్ వద్దకు వెళ్లినా ఆయన పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలతో ఇరు వర్గాల మధ్య రాజకీయ విభేదాలు మరింతగా తీవ్రరూపం దాల్చాయి. మరోవైపు, నాగార్జున సాగర్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు నీటిని తరలించడాన్ని అందరూ ఐక్యంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు.