నాగార్జునసాగర్, పులిచింతల జలాశయాల్లో చేపల వేట 61 రోజుల నిషేధం
నరసరావుపేట,అర్జున్ సమాచారం : చేపల పునరుత్పత్తి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని నాగార్జునసాగర్, కె.ఎల్. రావు పులిచింతల జలాశయాల్లో జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు మొత్తం 61 రోజుల పాటు చేపల వేట నిషేధం అమల్లో ఉంటుందని పల్నాడు జిల్లా మత్స్యశాఖ అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వులు జి.ఓ. ఎం.ఎస్. నెం.776 (ఆహార & మత్స్యశాఖ) తో పాటు తదుపరి ఉత్తర్వుల మేరకు ప్రతి ఏడాది ఈ నిషేధాన్ని అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కాలంలో జలాశయాల్లో చేపలు గుడ్లు పెట్టే దశలో...