నాగార్జున సాగర్‌లో ఏపీ అక్రమ నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలి – కేఆర్ఎంబీకి జగదీష్ రెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు • మంచినీటి పేరిట రూ.100 కోట్లతో రహస్యంగా పనులు చేపట్టారని ఆరోపణ • అదనపు 9 టీఎంసీల ప్రతిపాదనను అడ్డుకోవాలని కేఆర్ఎంబీకి వినతిపత్రం • తెలంగాణ జలాలను ఆంధ్రాకు కట్టబెట్టారంటూ రేవంత్ సర్కార్‌పై విమర్శలు
హైదరాబాద్,అర్జున్ సమాచారం: నాగార్జున సాగర్ ప్రాజెక్టు నడిగర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలించేందుకు నిర్మాణాలు చేపట్టిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఈ పనులను తక్షణమే నిలిపివేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) అధికారులను కలిసి ఆయన లేఖ అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మంచినీటి అవసరాల పేరిట నాగార్జున సాగర్ వద్ద ఇన్‌టేక్ వెల్ (సొరంగం) నిర్మాణాన్ని...