ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 23 September 2026, 6:22 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

నాగోల్ లో బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో మేగా రక్తదాన శిబిరం పాల్గోన్న ఎంపి ఈటల

మేడ్చల్,అర్జున్ సమాచారం:
ప్రధాని  నరేంద్ర మోదీ  ప్రజాక్షేత్రంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభసందర్భంగా, దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న “సేవా సంకల్ప్ అభియాన్”లో భాగంగా ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో నాగోల్ లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో ఎంపి ఈటల రాజేందర్,  బిజెపి రాష్ట్ర అధ్యక్షులు  ఎన్. రామచందర్ రావు , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) చంద్ర శేఖర్సి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపి ఈటల మాట్లాడుతూ భారత ప్రధాని  నరేంద్ర మోదీ  77వ వసంతంభలోకి అడుగుపెట్టారు. 25 ఏళ్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా వారు అందించిన సేవలు దేశం గర్వపడుతుంది. రతజాతి కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా ఆయన్ని గుర్తించి గౌరవిస్తుంది. ప్రపంచ చిత్రపటం మీద దేశ ఔన్నత్యాన్ని మోదీ రు పెంచారు అనడంలో  సందేహం లేదని అన్నారు.
భారతదేశం సొంత కాళ్ళ మీద నిలబడి మోడ్రన్ రైల్వే సిస్టం, ఎయిర్పోర్ట్లు, వేల కిలోమీటర్ల జాతీయ రహదారులు ఏర్పాటు చేస్తున్నారు. మౌలిక సదుపాయాల కోసం 2014 కంటే ముందు 2 లక్షల కోట్ల రూపాయల ఖర్చు చేస్తే ఇప్పుడు 15 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. దేశాన్ని గొప్పగా తీర్చిదిద్దుతున్నారు. ఆయన ఎప్పుడూ నేను పాలకున్ని అని అనరు, సేవకున్ని మాత్రమే అని చెప్తారు.
76 సంవత్సరాల వయసులో కూడా ఒక్కరోజు కూడా సెలవు లేకుండా నిరంతరం యంత్రంలాగా పనిచేస్తూ దేశాన్ని ముందుకు తీసుకుపోతున్న మోదీ గారు మరింత ఆరోగ్యవంతంగా ఉండి, ప్రజల ఆశీర్వాదం పొంది, భగవంతుని దయతో మరింత సేవా అందించాలని కోరుతున్నామని అన్నారు. ఈరోజు బీజేవైయం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించాము. ఇందులో పాల్గొని రక్త దానం చేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు  కాసం వెంకటేశ్వర్లు ,  బండ కార్తీక , రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు  ఎన్. గౌతం రావు,  తుళ్ల వీరేందర్ గౌడ్ , బీజేవైయం రాష్ట్ర అధ్యక్షులు  కుండె గణేష్  రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు  వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి  మాజీ అధ్యక్షులు  సామ రంగారెడ్డి, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
==========================