నాతో చర్చకు వస్తే మోదీ దేశ ద్రోహి అని ఐదు నిమిషాల్లో నిరూపిస్తా రాహుల్‌గాంధీ
అర్జున్ సమాచారం: : కేంద్రం ప్రభుత్వం పై, ప్రధాని నరేంద్రమోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ ‘దేశద్రోహి’ అని, ఆయనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నియంత్రిస్తున్నారని ఆరోపించారు. తనతో చర్చకువస్తే మోదీ దేశ ద్రోహి అనే ఆ విషయాన్ని ఐదు నిమిషాల్లో నిరూపిస్తానని అన్నారు. ఈ అంశంపై చర్చకు రావాలని ప్రధానికి సవాల్ విసిరితే పార్లమెంటులో చర్చిద్దామని ఎన్డీయే నేతలు అంటున్నారని చెప్పారు. కానీ లోక్‌సభలో తాను మాట్లాడకుండా మైక్ కట్ చేస్తారని విమర్శించారు. దేశంలో...