నారాయణరావు కుటుంబ సభ్యులను పరామర్శించిన చిరంజీవి
హైదరాబాద్, ఆగస్టు 28,అర్జున్ సమాచారం: రచయిత, నటుడు, తన మిత్రుడు జీవీ నారాయణరావు భౌతికకాయానికి మెగాస్టార్ చిరంజీవి నివాళులర్పించారు. ఆయన పార్థివ దేహానికి పూలమాల వేసి అంజలి ఘటించిన చిరంజీవి... అనంతరం నారాయణరావు కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతిని తెలిపారు. తన ఆప్తమిత్రుడితో ఉన్న దశాబ్దాల సుదీర్ఘ అనుబంధాన్ని, చివరి జ్ఞాపకాలను ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.1977 నుంచి తమ ఇద్దరి మధ్య పరిచయం ఉందని, ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందుతున్న సమయంలో నారాయణరావు తమకు సీనియర్ విద్యార్థిగా ఉండే వారని...