‘నార్నియా: ది మెజీషియన్స్ నెఫ్యూ’ ట్రైలర్ విడుదల
ప్రముఖ దర్శకురాలు గ్రెటా గెర్విగ్ తెరకెక్కిస్తున్న కొత్త ఫాంటసీ చిత్రం ‘నార్నియా: ది మెజీషియన్స్ నెఫ్యూ’ ట్రైలర్ విడుదలైంది. సీ.ఎస్. లూయిస్ రాసిన ప్రసిద్ధ నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. మాయాజాలం, ఉత్కంఠ, అద్భుతమైన పాత్రలతో ప్రేక్షకులను మరో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు ఈ చిత్రం సిద్ధమవుతోంది. ఈ సినిమా 2027 ఫిబ్రవరి 12న భారతదేశంలో థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్ర ట్రైలర్లో నార్నియా అనే అద్భుత ప్రపంచాన్ని పరిచయం చేశారు. డేవిడ్ మెక్కెన్నా డిగరీ కిర్క్ పాత్రలో, బీట్రైస్ క్యాంప్బెల్...