నాలుగు రాష్ట్రాల్లో ఐదు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు- నీట్ పేపర్ లీకేజీలో కేంద్రం దిద్దుబాటు చర్యలు
న్యూఢిల్లీ, జూలై 23,అర్జున్ సమాచారం: నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో విద్యార్థులను శాంతిపజేసేందుకు కేంద్రం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఉదయం ప్రధాని మోదీ చెప్పినట్టుగానే నాలుగు రాష్ట్రాల్లో ఐదు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్టు ఆదేశాలు జారీ చేసింది. బాంబే హైకోర్టు బెంచ్ పరిధిలో రెండు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పని చేయనున్నాయి. ప్రతి రోజూ విచారణ జరిపి త్వరితగతిన తీర్పు వచ్చేలా ఈ కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. నీట్ పేపర్ లీకేజీపై దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలపై ప్రధానమంత్రి మోదీ...