నిజామాబాద్ నుండి యూ.కేకు బియ్యం ఎగుమతులు లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్

నిజామాబాద్,అర్జున్ సమాచారం,జూలై 15: భారత్–యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య అమల్లోకి వచ్చిన సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (Comprehensive Economic Trade Agreement - CETA) ద్వారా ఎగుమతులకు లభిస్తున్న అవకాశాలను వినియోగించుకుంటూ నిజామాబాద్‌ నగరంలోని గజానన్ రైస్ మిల్ యాజమాన్యం యునైటెడ్ కింగ్‌డమ్‌కు బియ్యం ఎగుమతులకు అనుమతులు సాధించింది. ఈ మేరకు గజానన్ రైస్ మిల్లు నుండి యూ.కే కు ఎగుమతి అవుతున్న సోనా మసూరి ఎక్స్పోర్ట్ క్వాలిటీ బియ్యం నిల్వలతో కూడిన వాహనాలకు కలెక్టర్ ఇలా త్రిపాఠి లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు....