ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 01 September 2026, 7:46 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

. నిన్నటి వరకు జీతాల కోసం ఎదురుచూపులు నేడు ఉద్యోగాల నుంచే తొలగింపులు. అంటే ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది?

హైదరాబాద్,అర్జున్ సమాచారం:
ఉద్యోగ భద్రత కల్పించాల్సిన ప్రభుత్వమే ఆరోగ్యశ్రీలో 22 ఏళ్లుగా సేవలందిస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్లను (DEOs) తొలగించడం దురదృష్టకరమని మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. ధీర్ఘ కాలికంగా సేవలందించిన ఉద్యోగులను ఒక్క నిర్ణయంతో రోడ్డున పడేయడం న్యాయమా ? తగిన జీతాలు, ఉద్యోగ భద్రత లేకపోయినా ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్న వారి ఉపాధిని దెబ్బతీయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
ఆరోగ్యశ్రీలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్లను (DEOs) విధుల నుంచి తొలగించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. డీఈఓల సుదీర్ఘ అనుభవం, సేవలను ప్రభుత్వం గుర్తించాలి. వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. వారిని ఉద్యోగాల నుంచి తొలగించడానికి బదులుగా ఇతర ప్రభుత్వ విభాగాలు లేదా  పథకాల్లో సర్దుబాటు చేసి, వారి సేవలను కొనసాగించాలి. ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించి, ఆరోగ్యశ్రీ, డీఈఓలకు ఉద్యోగ భద్రత కల్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.
———————-