. నిన్నటి వరకు జీతాల కోసం ఎదురుచూపులు నేడు ఉద్యోగాల నుంచే తొలగింపులు. అంటే ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది?
హైదరాబాద్,అర్జున్ సమాచారం: ఉద్యోగ భద్రత కల్పించాల్సిన ప్రభుత్వమే ఆరోగ్యశ్రీలో 22 ఏళ్లుగా సేవలందిస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్లను (DEOs) తొలగించడం దురదృష్టకరమని మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. ధీర్ఘ కాలికంగా సేవలందించిన ఉద్యోగులను ఒక్క నిర్ణయంతో రోడ్డున పడేయడం న్యాయమా ? తగిన జీతాలు, ఉద్యోగ భద్రత లేకపోయినా ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్న వారి ఉపాధిని దెబ్బతీయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్లను (DEOs) విధుల నుంచి తొలగించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. డీఈఓల...