నిమజ్జన వేడుకల భద్రత కోసం హైదరాబాద్‌లో 20 వేల మంది పోలీసులు, ఇతర జిల్లాల్లో 8,400 మంది సిబ్బంది పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ హైదరాబాద్

హైదరాబాద్,అర్జున్ సమాచారం: నగరంలో వినాయక విగ్రహాల నిమజ్జన వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని విభాగాల ఉద్యోగులు సమన్వయంతో పనిచేస్తున్నట్లు హైదరాబాద్‌ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ వెల్లడించారు. నిమజ్జన ఏర్పాట్లపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గణేశ్‌ వేడుకలకు సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని ఫేక్‌ వీడియోలు వైరల్ చేస్తున్నారని, పాత లేదా నకిలీ వీడియోలను పోస్టు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా గణేశ్‌ మండపాల వద్ద అసభ్యకరమైన వల్గర్‌ పాటలు మరియు డ్యాన్స్‌లపై ఫిర్యాదులు అందాయని...