అర్జున్ సమాచారం:
సీఈసీ జ్ఞానేష్ కుమార్ తన అధికారిక పర్యటనలను వాయిదా వేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం నేడు, రేపు ఆయన ఛత్తీస్ గఢ్లో పర్యటించాల్సి ఉంది.
దంతెవాడ, బస్తర్, కవర్ధా లాంటి ప్రాంతాల్లో పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడినట్టు ఎన్నికల కమిషన్ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. ఛత్తీస్గఢ్ పర్యటనకు సంబంధించి సవరించిన తదుపరి తేదీలను త్వరలోనే ప్రకటించనుంది. అయితే దేశవ్యాప్తంగా జ్ఞానేష్ కుమార్కు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతుండటంతోనే పర్యటనలను వాయిదా వేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.
అంతకుముందు సెప్టెంబర్ చివరివారంలోనూ ఆయన యూపీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో పర్యటించాల్సి ఉండగా పర్యటనలను వాయిదా వేసుకున్నారు. ప్రస్తుతం ఆయనకు వ్యతిరేకంగా ఆందోళనలు పెరిగిపోయాయి. మంగళవారం జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ 300 మందికి పైగా ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్ నుండి ఎన్నికల సంఘం కార్యాలయం వరకు మార్చ్ నిర్వహించారు. ఈ క్రమంలో అర్ధరాత్రి వరకు అక్కడ హైడ్రామా నెలకొంది. మరోవైపు సీజేపీ సైతం ఆందోళనలు చేస్తోంది.
===========================