నెట్‌ఫ్లిక్స్ కోసం మెగాస్టార్ టాక్ షో ‘మెగావర్స్’ షూటింగ్ ప్రారంభం

మెగాస్టార్ అంటేనే వైవిధ్యానికి మరో పేరు. దశాబ్దాలుగా తన అద్భుతమైన నటనతో వెండితెరపై కోట్లాది మంది ప్రేక్షకులను అలరిస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ అరంగేట్రంతో మరో ఆసక్తికరమైన ప్రయాణానికి సిద్ధమయ్యారు. ‘మెగావర్స్’ పేరుతో రూపొందుతున్న ఈ షో ద్వారా ఆయన డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. గ్లోబల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌పై ప్రసారం కానున్న ఈ ప్రత్యేకమైన టాక్ షోలో చిరంజీవి తనదైన చరిష్మా, హాస్యం, విభిన్నమైన ఆలోచనా విధానంతో ప్రేక్షకులను అలరించనున్నారు. ఆసక్తికరమైన సంభాషణలు, అద్భుతమైన కథలు, ఎన్నో కొత్త విషయాల...