నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానున్న ‘అక్క’ ట్రైలర్‌ విడుదల విధేయతతో నిర్మించబడిన ఒక సామ్రాజ్యం.. తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్న ఒక వారసత్వం.. వీటన్నింటినీ నాశనం చేసే ప్రమాదం ఉన్న ఒక తీవ్రమైన ప్రత్యర్థిత్వం!

అధికారం, వారసత్వం, ప్రతీకారం నేపథ్యంలో సాగే ఉత్కంఠభరితమైన గ్యాంగ్‌స్టర్ కథా సిరీస్ ‘అక్క’ ట్రైలర్‌ను నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసింది. ఈ సిరీస్‌లో కీర్తి సురేష్, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. YRF ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ఈ సిరీస్‌కు ధర్మరాజ్ శెట్టి రచన, దర్శకత్వం వహించారు. మహిళలే అధికారాన్ని శాసిస్తూ, తమ సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి పోరాడే ఒక విభిన్నమైన ప్రపంచాన్ని ఈ సిరీస్ ఆవిష్కరించనుంది. ఈ సిరీస్ అక్టోబర్ 30న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ కానుంది. పెర్నూరు అనే రాజ్యం, అక్కడి...