“నేను సైతం” కార్యక్రమంలో భాగంగా సీసీటీవీ కెమెరాల జియో ట్యాగింగ్‌ సైబరాబాద్ సీపీ సమీక్ష

సైబరాబాద్,అర్జున్ సమాచారం: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో "నేను సైతం" కార్యక్రమంలో భాగంగా సీసీటీవీ కెమెరాల జియో ట్యాగింగ్, పర్యవేక్షణ, నిర్వహణ, విస్తరణపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్, అధ్యక్షతన బుధవారం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ప్రధాన కార్యాలయ ఆడిటోరియంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్పెషల్ బ్రాంచ్ (ఎస్‌బీ) డీసీపీ వై.వి.ఎస్. సుధీంద్ర తో పాటు వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నివారణ, నేరాల దర్యాప్తు, కీలక సమాచార సేకరణలో...