నేరాల నియంత్రణలో అప్రమత్తతతో పనిచేయాలి – జిల్లా ఎస్పీ NH-44పై ట్రాఫిక్ అంతరాయం లేకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలి మూసాపేట పోలీస్ స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ డి.జానకి,
మహబూబ్‌నగర్,అర్జున్ సమాచారం: వార్షిక తనిఖీలలో భాగంగా మూసాపేట పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ డి.జానకి, తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, స్టేషన్ నిర్వహణ, రికార్డుల నిర్వహణను క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదవుతున్న నేరాల వివరాలు, పెండింగ్ కేసులు, రౌడీ షీట్లు, సస్పెక్ట్ షీట్లు, బైండోవర్ కేసుల పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. నేరాల నియంత్రణలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, నేరప్రవృత్తి కలిగిన వ్యక్తులపై నిరంతర నిఘా ఉంచి చట్టపరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. పోలీస్ స్టేషన్‌కు...