న్యాయవ్యవస్థలో బహుజనులకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాలి సామాజిక న్యాయమే లక్ష్యంగా బీసీ లాయర్స్ అసోసియేషన్ తీర్మానం

హైదరాబాద్, అక్టోబర్ 10:అర్జున్ సమాచారం: న్యాయవ్యవస్థలో బహుజన వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని బీసీ లాయర్స్ అసోసియేషన్ తీర్మానించింది. న్యాయవ్యవస్థలో సామాజిక న్యాయం, సమాన అవకాశాలు బలోపేతం కావాలంటే న్యాయమూర్తుల నియామకాలతో సహా అన్ని కీలక వ్యవస్థల్లో జనాభా నిష్పత్తికి అనుగుణంగా బహుజన న్యాయవాదులకు తగిన ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని సదస్సు అభిప్రాయపడింది. హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో శనివారం ‘ఉన్నత న్యాయవ్యవస్థలో సామాజిక న్యాయం అనే అంశంపై బీసీ లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడు తలకొక్కుల రాజు...