న్యాయ దిగ్గజం రామ్ జెఠ్మలానీ విగ్రహావిష్కరణ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వర్చువల్ ఆవిష్కరణ
కరీంనగర్,అర్జున్ సమాచారం: సుప్రీంకోర్టు, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తుల విశిష్ట భాగస్వామ్యం. భారత న్యాయరంగంలో తన అసాధారణ ప్రతిభ, న్యాయపరిజ్ఞానం, వాదనా పటిమతో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్న ప్రముఖ సీనియర్ న్యాయవాది, మాజీ కేంద్ర మంత్రి, భారత బార్ కౌన్సిల్ మాజీ చైర్మన్ దివంగత రామ్ జెఠ్మలానీకి కరీంనగర్లో ఘన నివాళి అర్పించారు. ఆయన న్యాయరంగానికి అందించిన అమూల్యమైన సేవలకు గుర్తుగా కరీంనగర్లోని జస్టిస్ కుమారయ్య కాలేజ్ ఆఫ్ లా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని శనివారం భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి...