పటాన్చెరు లోనే కార్మికులకు పీఎఫ్ సేవలు ఎంపీ ఆదేశాలతో చర్యలు తీసుకున్న అధికారులు బస్టాండ్ లో నూతన కార్యాలయం పనులను పరిశీలించిన రఘునందన్ రావు

పటాన్చెరు:అర్జున్ సమాచారం: పీఎఫ్ కార్యాలయాన్ని హైదరాబాద్ కు తరలిస్తున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు గురువారం పటాన్చెరు లో పీఎఫ్ అధికారులతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు.ప్రస్తుతం ఉన్న భవనం నుంచి పటాన్చెరు బస్టాండ్ లోకి నూతన కార్యాలయం ఏర్పాటు చేయనున్నామని,అక్కడ పనులు పూర్తయ్యే వరకు మాత్రమే ఆన్లైన్ సేవల కోసం కొత్తగూడ లో ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.బస్టాండ్ మొదటి,రెండో అంతస్తులో విద్యుత్,ఇంటర్నెట్,పార్టిషన్ తదితర సౌకర్యాలు అందుబాటులో కి రావడానికి మూడు నెలల సమయం పడుతుందని...