పట్టభద్రులంతా ఓటరుగా నమోదు కావాలి బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి వరంగల్ సెంట్రల్ లైబ్రరీని సందర్శించి విద్యార్థులకు విజ్ఞప్తి
హనుమకొండ, అక్టోబర్ 3,అర్జున్ సమాచారం: రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా శనివారం వరంగల్ సెంట్రల్ లైబ్రరీని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి సందర్శించారు. వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులను కలిసి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరుగా నమోదు కావాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సాధారణ ఎన్నికలతో పోలిస్తే చాలా భిన్నమైనదని, ఇందులో ఉన్నత విద్యావంతులు, మేధావులు, సమాజం పట్ల సంపూర్ణ అవగాహన ఉన్నవారే ఓటు వేస్తారని అన్నారు. కాబట్టి ఇచ్చే తీర్పుకు...