పనిలేక తిరుగుతున్నానా? రేవంత్ సర్కార్‌ను కూల్చేదాకా ఆగను: ఈటల రాజేందర్

అర్జున్ సమాచారం: సికింద్రాబాద్: జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌ను తరలించాలనే డిమాండ్‌తో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చేపట్టిన పాదయాత్ర నాలుగోవ రోజు సాగుతోంది. ఈ క్రమంలో ఆయన రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేవలం డంపింగ్ యార్డ్ తరలించేంతవరకే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే వరకు తన యాత్ర ఆగదని ఆయన హెచ్చరించారు. పనిలేక తిరుగుతున్నానంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలపై ఈటల ఘాటుగా స్పందించారు. "డంపింగ్ యార్డ్ తొలగింపు కోసం నేను పాదయాత్ర చేస్తుంటే, ఈటల రాజేందర్‌కు పనిలేక తిరుగుతున్నాడని కాంగ్రెస్...