పరవాడ ఫార్మాలో మరో అగ్నిప్రమాదం అర్ధరాత్రి మంటలతో కలకలం

అర్జున్ సమాచారం: అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా పరిశ్రమల్లో మరోసారి అగ్నిప్రమాదం కలకలం రేపింది. తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో సాయి చందన ఏపీఐ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. =======================