ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 21 November 2026, 9:04 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

పరుగుల రాణి కి బంగారు పతకం

కమాన్ పూర్ నవంబర్ 21. అర్జున్ సమాచారం :                                                                                      కమాన్ పూర్ మండల కేంద్రానికి చెందిన నల్లవెల్లి ఆనందికి బంగారు పతకం లభించింది.
మధ్యప్రదేశ శివుపురి లో  జరిగిన 70వ ఎస్ జి ఎఫ్ ఛాంపియన్ షిప్ జాతీయస్థాయి 17 సంవత్సరాల విభాగంలో 400 మీటర్ల పరుగు పందెంలో కమాన్ పూర్ మండల కేంద్రానికి చెందిన నల్లవెల్లి భారతి శంకర్ ల ద్వితీయ పుత్రిక నల్లవెల్లి ఆనంది 55 :89సెకండ్లు పూర్తి చేసి బంగారు పతకం సాధించిది. నల్లవెల్లి ఆనంది గతంలో జాతీయ మెడల్స్ సాధించిన విషయం తెలిసినది ఆనంది కమాన్ పూర్ మండలం గుండారంలోని  జూనియర్ కళాశాలలో సిఇసి రెండవ సంవత్సరం చదువుతున్నది. చదువుల్లో సైతం ఇంటర్ మొదటి సంవత్సరంలో ర్యాంకులు సాధించింది. పట్టుదలతో అనేక  పతకం లు సాధించిన ఆనందిని మళ్లీ జాతీయస్థాయిలో గోల్డ్ మెడల్ సాధించడం అభినందనీయమని కోచ్ సుబ్బారావు రాష్ట్ర అథ్లెటిక్  అసోసియేషన్ సెక్రటరీ సారంగపాణి ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకటేశ్వర రెడ్డి  పేర్కొన్నారు.జిల్లా ఎస్జీఎఫ్ సెక్రెటరీ లక్ష్మణ్ డి ఎస్ వై ఓ సురేష్ పెద్దపల్లి కలెక్టర్ ఆఫీస్ ఏవో బండి ప్రకాష్ ప్రకాష్ రిటైర్డ్ డి.ఎస్.పి బెల్లంకొండ నర్సింగరావు  అథ్లెటిక్ అసోసియేషన్ సెక్రెటరీ కొమ్ము గట్టయ్య జూనియర్ కాలేజ్ ఇన్చార్జి ప్రిన్సిపాల్ రమేష్ సింగల్ విండో చైర్మన్ ఇనగంటి భాస్కరరావు కమాన్ పూర్ సర్పంచ్ రంగు సత్య నారాయణ గౌడ్,  రత్నాపూర్ సర్పంచి పల్లె ప్రతిమా పివి రావు, మాజీ జెడ్పిటిసి గంట వెంకటరమణారెడ్డి, లైన్స్ క్లబ్ కమాన్ పూర్ అధ్యక్షులు సాన రామకృష్ణారెడ్డి, మత్తకార సొసైటీ అధ్యక్షులుగడప కృష్ణమూర్తి, మాజీ ఎంపిటిసిలు పిల్లి చంద్రశేఖర్, కోలేటి చంద్రశేఖర్, డాక్టర్ విజయకుమార్, లైన్స్ క్లబ్ సభ్యులు జబ్బార్ ఖాన్  ఆనందికి అభినందనలు తెలిపినారు
=======================