పశ్చిమ బెంగాల్‌లో మరో ఎన్‌కౌంటర్.. – పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూమ్ జిల్లాలో ఘటన – ఆయుధం రికవరీ చేస్తుండగా పోలీసులపై కాల్పులు – ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపామన్న పోలీసులు – నేరగాళ్లకు రాష్ట్రంలో స్థానం లేదన్న సీఎం సువేందు అధికారి
బర్ధమాన్, అర్జున్ సమాచారం: పశ్చిమ బెంగాల్‌లోని శాంతినికేతన్‌లో ఓ పోలీస్ కానిస్టేబుల్‌పై కాల్పులు జరిపిన కేసులో నిందితుడిగా ఉన్న హిస్టరీ షీటర్, పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. బీర్‌భూమ్ జిల్లా నానూర్‌లోని ఓ ఇటుక బట్టీ వద్ద ఆదివారం ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. రతన్ షేక్ అనే హిస్టరీ షీటర్‌ను అరెస్ట్ చేసేందుకు నవంబర్ 13న శాంతినికేతన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాయిక్ బజార్ వద్ద పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో నిందితుడు పోలీసులపై కాల్పులు జరపగా,...