పాక్స్ కమిటీలు రైతులకు అందుబాటులో వుండాలి పెద్దపల్లి పాక్స్ నూతన కమిటీ సభ్యులకు విప్ చింతకుంట విజయరమణారావు అభినందనలు

పెద్దపల్లి,అర్జున్ సమాచారం: పెద్దపల్లి ప్రాథమిక వ్యవసా య సహకార సంఘం (పాక్స్) నూతనంగా ఎన్నికైన చైర్మన్ ముత్యాల నరేష్ ముదిరాజ్, కమిటీ సభ్యులు ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణా రావును  మర్యాదపూర్వకం గా కలిసి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా విప్ విజయరమణారావు చైర్మన్ ముత్యాల నరేష్, డైరెక్టర్లకు అభినందనలు తెలిపారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తూ సహకార సంఘం ద్వారా రైతులకు అందుబాటులో ఉన్న అన్ని సేవలు, ప్రభుత్వ పథకాలు, రుణ సదుపాయాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు....