ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 01 July 2026, 8:10 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

పాఠశాల వనమహోత్సవం.జయశంకర్ భూపాలపల్లి.

జయశంకర్ భూపాలపల్లి , అర్జున్ సమాచారం :

జులై మొదటి వారం జులై 1 నుండి 7వ తేది వరకు నిర్వహించవలసిన వనమహోత్సవ కార్యక్రమం బాలుర పాఠశాల మహాదేవపూర్ లో  బుధవారం గ్రామ సర్పంచ్ హసీనా బాను మొక్కలు నాటి ప్రారంభించారు. మహాదేవపూర్ ఎంపీడీఓ రవీంద్ర నాథ్,ఎంఈఓ పురుషోత్తం రెడ్డి,రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు అడప రాజయ్య, మహమ్మద్ అక్బర్ ఉపాధ్యాయులు,విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో బాలుర పాఠశాల ప్రధానోపాధ్యాయులు  అనిల్ కుమార్, ఎన్ జి సీ ఉపాధ్యాయులు ప్రభాకర్ రెడ్డి  ఉపాధ్యాయులు రాజిరెడ్డి,తిరుపతి రెడ్డ, రాజయ్య, సిరంగి రమేష్ అనిల్,సమ్మయ్య,అనిత కోటేశ్వర్, శ్రీనివాస్ మరియు విద్యార్థులు పాల్గొని ఒక్కొక్క ఉపాధ్యాయుని
(టీచర్ కే నామ్ పే ఏక్ పేడ్ ) పేరుతో  ఒక మొక్క నాటి,వీటి సంరక్షణ బాధ్యత కూడా విద్యార్థులు తీసుకొన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతీ పౌరుని బాధ్యతని గ్రామ సర్పంచ్ అన్నారు. పర్యావరణాన్ని కాపాడక పోతే మానవులు తీవ్ర సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుందని ఎన్ జీ సీ ఇంచార్జి టీచర్ ప్రభాకర్ రెడ్డి అందరికి వివరించారు.ఈరోజు నుండి మనందరం మొక్కలు నాటదాన్ని ఉద్యమంగా నిర్వహించాలని ఎం ఈ ఓ పురుషోత్తం రెడ్డి అన్నారు.