పాత బ‌స్తీలో చారిత్ర‌క బావికి ప్రాణం పోస్తున్న‌ హైడ్రా నిజాంలు నీళ్లు తాగిన బావి పున‌రుద్ధ‌ర‌ణకు శ్రీ‌కారం బుమ్-రుక్న్-ఉద్-దౌలా చెరువు చెంత ఊట బావి పున‌రుద్ధ‌ర‌ణ‌

హైదరాబాద్‌, అక్టోబరు 01: అర్జున్ సమాచారం: చ‌రిత్ర‌, సంస్కృతి, సంప్ర‌దాయాల‌కు నిలువెత్తు నిద‌ర్శ‌న‌మైన హైద‌రాబాద్‌లో ఏ ప్రాంతానికి వెళ్లినా చారిత్ర‌క నేప‌థ్యం ఉంటుంది. ఇక పాత బ‌స్తీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాలా.. అడుగ‌డుగునా చారిత్ర‌క సాక్ష్యాలు ఎన్నో.. అదే కోవ‌కు వ‌స్తుంది శివ‌రాంప‌ల్లిలోని బుమ్-రుక్న్-ఉద్-దౌలా చెరువు. ఈ చెరువుకు 356 ఏల్ల చ‌రిత్ర ఉంటే.. ఆ చెరువు కింది భాగంలో 1.50 ఎక‌రాల విస్తీర్ణంలో ఉన్న ఊట బావికి కూడా అంతే ప్ర‌త్యేక‌మైన చారిత్ర‌క నేపథ్యం ఉంది. ఇప్ప‌టికే చెరువును పున‌రుద్ధ‌రించి పాత‌బ‌స్తీకి మ‌ణిహారంగా...