ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 19 September 2026, 6:54 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

పాలన చేతగాక… సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ హై కోర్టు తీర్పు రేవంత్ రెడ్డికి చెంప పెట్టు పార్టీ ఫిరాయింపుల సూత్రధారి రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక హక్కు లేదు మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి.

జగిత్యాల,అర్జున్ సమాచారం:
తెలంగాణ రాష్ట్రంలో పాలన చేతగాక సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని, ఎమ్మెల్యేల పార్టీ కిరాయింపుల కేసులో హైకోర్టు తీర్పు రేవంత్ రెడ్డికి చెంప పెట్టని, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదని మాజీ మంత్రి, టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి, జగిత్యాల జిల్లా మాజీ చైర్పర్సన్ దావ వసంత – సురేష్ తో కలిసి విలేకరుల సమావేశంలో శనివారం మాట్లాడారు. ఎల్ నినో ప్రభావంతో దుర్భిక్ష పరిస్థితుల్లో ఉన్న రైతాంగానికి నీరు ఎలా అందించాలని ఆలోచించకుండా రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అన్నారం సుందిల్ల పంపు హౌస్ లు రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకోవచ్చని ఎన్ డి ఎస్ ఏ పేర్కొందని తెలిపారు. తెలంగాణ ను కరువు నుండి కాపాడే అవకాశం ఉన్నప్పటికీ, కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీరిస్తే కేసీఆర్ కు ఎక్కడ మంచి పేరు వస్తుందోనని, భేషజాలకు పోయి పంపు ఆన్ చేయడం లేదని విమర్శించారు. కేసీఆర్ విద్యుత్ ఉత్పత్తిని నాలుగింతలు చేసి, వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా చేశారని, 24 గంటల ఉచిత విద్యుత్తును రేవంత్ రెడ్డి ఎందుకు సరఫరా చేయడం లేదని విమర్శించారు. ఇది మీ చేతగాని పాలనకు నిదర్శనం కాదా..అని మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీ నడిపి, కనీసం రైతులను ఏవిదంగా ఆదుకోవాలనే తీర్మానం చెయ్యలేదని విమర్శించారు.
ఎమ్మెల్యే దానం నాగేందర్ పై వేటు పడబోతుందని ముందే ఊహించిన విషయమేనని, ఒక పార్టీ బీ ఫారం నుండి గెలిచి మరో పార్టీ బీ ఫారం పై పోటీ చేసిన నాగేందర్ పై వేటు పడిన విషయం అసెంబ్లీలో చర్చకు రాకుండా చేసి, కెసిఆర్ భూమిపై పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ కు కిలోమీటర్ దూరం లో భూమి కబ్జా చేసుకున్నారంటూ రేవంత్ రెడ్డి కుట్ర పూరితంగా కెసిఆర్ పై బట్ట కాల్చి మీదేస్తున్నారని, కేసీఆర్ కు ఉన్నది కేవలం 67 ఎకరాలు భూమి మాత్రమేనని,రేవంత్ రెడ్డి కుటుంబానికి వందల ఎకరాలు భూమి ఉందని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో సుమారు 200 మంది దళితులకు అసైన్డ్ భూములు ఇచ్చారని, అందరికీ పట్టాదారు పాసు బుక్కులు కలిగి ఉండి, విద్యుత్ కనెక్షన్, రైతు బంధు పొందుతున్నారన్నారు.
రేవంత్ రెడ్డి అసమర్థ పాలన..రాష్ట్రానికి శాపంగా మారిందని, ఆరు గ్యారంటీల హామీల అమలులో వైఫల్యం చెందారని విమర్శించారు.
దానం నాగేందర్ పై హైకోర్టు తీర్పు రేవంత్ రెడ్డికి చెంప పెట్టని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి పని చేస్తున్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, రైతుల సమస్యలు చర్చకు రాకుండా అడ్డుకుంటున్నారని మాజీ మంత్రి జీవన్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల్లో పేర్కొన్న ఆస్తుల కన్నా ఎక్కువ ఉంటే ప్రభుత్వం తీసుకోవాలని కేటీఆర్ సవాలు విసిరారని మాజీ మంత్రి జీవన్ రెడ్డి గుర్తు చేశారు. పార్టీ ఫిరాయింపులకు స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా రేవంత్ రెడ్డి యే నని విమర్శించారు.
రాజ్యంగాన్ని పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీని విమర్శించే హక్కు రేవంత్ రెడ్డికి లేదని రాజ్యాంగంపై ఏ మాత్రం గౌరవం ఉన్నా ముఖ్యమంత్రి పదవి నుండి రేవంత్ రెడ్డిని తొలగించాలని కోరారు.
రాజ్యాంగ ప్రకారం రాగ ద్వేషాలకు అతీతంగా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని, తక్షణమే రేవంత్ రెడ్డి ని సీఎం పదవి నుండి తొలగించాలన్నారు.
రేవంత్ రెడ్డి కి ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక హక్కు లేదన్నారు.
ప్రజాస్వామ్య ప్రక్రియను అపహాస్యం చేసిన
రేవంత్ రెడ్డి నైతికంగా పదవిలో కొనసాగే హక్కు లేదని, కేసీఆర్ ప్రాణాన్ని ఫణంగా పెట్టిన కెసిఆర్ పై రేవంత్ ఆరోపణలు చేస్తు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు.
రేవంత్ రెడ్డి కి వ్యవసాయంపై అవగాహన లేదని, ఎల్ నినో ప్రభావం నుండి రైతులను ఆడుకునేందుకు కన్నెపల్లి పంప్ హౌస్ నుండి నీటిని తరలించాలని, నిర్దిష్ట సమయాల్లో విద్యుత్ సరఫరా చేయాలని సూచించారు ‌
=========================