హైదరాబాద్‌లో ‘పింక్ గులాబ్ – ది హెరిటేజ్ ఎడిట్’ ప్రదర్శన ప్రారంభమైంది. ప్రముఖ నటి, సామాజిక వ్యాపారవేత్త అమల అక్కినేని ఈ ప్రదర్శనను ప్రారంభించారు. ఆగస్టు 21, 22 తేదీల్లో బంజారాహిల్స్ లో క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణలో ఈ ప్రదర్శన కొనసాగనుంది.
భారతీయ చేనేతలు, సిల్క్ వస్త్రాలు, కాంతా ఎంబ్రాయిడరీ, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, సంప్రదాయ కళలు, హస్తకళా ఉత్పత్తులు ప్రదర్శనలో అందుబాటులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న కళాకారులు, నేత కార్మికులు, డిజైనర్లు, స్వదేశీ బ్రాండ్లను ఒకే వేదికపైకి తీసుకురావడం ఈ ప్రదర్శన ప్రత్యేకత. సంప్రదాయ కళలను ప్రోత్సహిస్తూ కళాకారులకు మార్కెట్ అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
=======================