పీఎంఏవై జీ కింద రాష్ట్రానికి 11.56 లక్షల ఇండ్లు కేటాయించండి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
న్యూ ఢిల్లీ,అర్జున్ సమాచారం: తెలంగాణకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ (PMAY-G) కింద 11.56 లక్షల ఇండ్లను కేటాయించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు సొంత ఇల్లు నిర్మించి ఇవ్వడానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి పలువురు ఎంపీలతో కలిసి కృషి భవన్ లో కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు. ఈ...